Kalki 2898 AD | అవన్నీ రూమర్స్.. అనుకున్న తేదీకే ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’
తప్పుడు వార్తలను సృష్టించడమే కొందరి జీవన విధానం. రేటింగుల కోసం వాస్తవాలను మరుగున పరచడమే వీరి వృత్తి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా తాజాగా వీరి బారిన పడింది. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Kalki 2898 AD | తప్పుడు వార్తలను సృష్టించడమే కొందరి జీవన విధానం. రేటింగుల కోసం వాస్తవాలను మరుగున పరచడమే వీరి వృత్తి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా తాజాగా వీరి బారిన పడింది. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ‘కల్కి 2898 ఏడీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ ఫిక్షన్ మూవీ కావడం, ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ, పశుపతి లాంటి సూపర్‌స్టార్స్ ఇందులో నటిస్తుండటం.. పైగా సీజీ వర్క్‌తో కూడిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటం..
ఈ కారణాలవల్ల విడుదలకు ఇంకాస్త జాప్యం జరిగే అవకాశాలున్నాయనేది ఈ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఈ రూమర్లపై చిత్రబృందం స్పందించింది. ప్రభాస్‌కి సంబంధించిన ‘జస్ట్ ది వార్మ్ అప్’ క్యాప్షన్‌తో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా మే 9నే ‘కల్కి 2898 ఏడీ’ విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

