సెట్స్‌పైకి ‘కల్కి-2’?
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్‌ఫిక్షన్ ‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్‌ఫిక్షన్ ‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సీక్వెల్‌ను అక్టోబర్ రెండోవారంలో సెట్స్‌పైకి తీసుకొస్తున్నామని దర్శకుడు నాగ్అశ్విన్ గతంలోనే వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం గురువారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, ఇందులో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారని తెలిసింది.
హైదరాబాద్‌లోనే భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేసినట్లు తెలిసింది. సీక్వెల్లో కథా పరిధి మరింత పెద్దగా ఉంటుందని, విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయని అంటున్నారు. ఈ సినిమా నుంచి దీపికా పడుకోన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో సాయిపల్లవి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘కల్కి’ తొలిభాగం వెయ్యికోట్ల పైచిలుకు వసూళ్లతో సంచలనం సృష్టించడంతో సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

