Salaar-1 | ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్-1’. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. భారీ పోరాట ఘట్టాలు, ైస్టెలిష్ మేకింగ్‌తో టీజర్ అందరిని ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 3న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది.
ఇదిలా ఉండగా అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలుపెట్టారు. దాదాపు 290 లొకేషన్స్‌లో ఇప్పటికే 11వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్పథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.