Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Prabhas Birthday | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే వేడుకలను పురస్కరించుకుని ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు.
Prabhas Birthday | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే వేడుకలను పురస్కరించుకుని ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. రెబల్ స్టార్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచి, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23)ను కానుకగా ఆయన అభిమానులను అలరించేందుకు క్లాసిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వర్షం’ (Varsham), అలాగే మాస్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘ఛత్రపతి’ (Chatrapathi) చిత్రాలు సరికొత్త హంగులతో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్, త్రిష జంటగా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వర్షం’ అప్పట్లో యువతను ఎంతగానో ఊపేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు, గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీని, ఇప్పుడు అత్యాధునిక 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, సంచలన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ డ్రామా ‘ఛత్రపతి’ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’ చిత్రాల తర్వాత ప్రభాస్‌కు ఇండస్ట్రీలో ఒక మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను తెచ్చిపెట్టిన చిత్రం ఇది. సినిమాలోని ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడం ఖాయం. రీ-రిలీజ్ ట్రెండ్‌లో ఈ మాస్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ రెండు సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో, సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హడావుడి అప్పుడే తారాస్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో స్పెషల్ షోలు, భారీ కేక్ కట్టింగ్ వేడుకలతో థియేటర్లను హోరెత్తించడానికి డార్లింగ్ ఫ్యాన్స్ అంతా సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

