Prabhas Birthday | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం యూరప్‌లో వున్నారు. ఆయన మోకాలికి చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే. ఈ ఏడాది పుట్టిన రోజు యూరప్‌లోనే జరుపుకుంటున్నారు. బర్త్ డేకి స్పెషల్ ఏర్పాట్లు వున్నాయి. ప్రభాస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, యూరప్ ప్రయాణం అవుతున్నారు. వారి సమక్షంలో బిగ్ బర్త్ డే పార్టీ ఉంటుంది.
ఇక ప్రభాస్ బర్త్ డేకి ఆయన కొత్త సినిమాల అప్డ్డేట్లు కూడా రెడీ అవుతున్నాయి. సలార్ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులని పలకరించనుంది. అలాగే కల్కీ 2898 ఏడీ సినిమా నుంచి కూడా ఒక స్పెషల్ క్లిప్ ని విడుదల చేసే అవకాశం వుంది. మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ బర్త్ డే కానుక గా విడుదల చేయనున్నారు. ఇక అక్టోబర్ చివరి వారంలో ప్రభాస్ ఇండియా తిరిగిరానున్నారు.