Salaar Movie | సలార్ మూవీ బిగ్ అప్డేట్.. ప్రభాస్ అభిమానులకు పూనకాలే..!
'కేజీఎఫ్-2' ఘన విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గుడుస్తున్న చిత్రానికి సంబంధించిన అపడేట్లు మాత్రం రావడంలేదు.
Salaar Movie Latest Update | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి వరుస ఫ్లాప్‌లు ప్రభాస్ క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘కేజీఎఫ్-2’ ఘన విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గుడుస్తున్న చిత్రానికి సంబంధించిన అపడేట్లు మాత్రం రావడంలేదు. ఈ విషయంలో మాత్రం డార్లింగ్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘సలార్’ షూటింగ్ ఇప్పటి వరకు 85% షూటింగ్ పూర్తి చేసుకుందని, మిగితా 15% జనవరిలో పూర్తి చేస్తామని చెప్పాడు. వీఎఫ్ఎక్స్కు 6నెలల సమయం కేటాయించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లు గానే సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఇక ఇప్పటికే సినిమా రషెస్ చూశానని.. ప్రభాస్, పృథ్విరాజ్ సూపర్‌గా నటించారని పేర్కొన్నాడు. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపాడు. ఈ మాటలతో ప్రభాస్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్చ, జగపతి బాబు ప్రతినాయకులుగా కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. హోంబలే సంస్థ ఈ సినమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

