Unstoppable-2 | బాలకృష్ణ షోకు ప్రభాస్, గోపిచంద్.. అల్లు అరవింద్ ప్లాన్ మాములుగా లేదుగా..!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్-2' డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది.
Unstoppable Season-2 | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ టాక్‌షోకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించడంతో అందరిలోనూ ఓ పాజిటీవిటి ఏర్పడింది. ఎక్కువగా టాక్ షోలకు రాని సెలబ్రెటీలు సైతం బాలయ్యతో షో అనగానే ఓకే చెప్పేస్తున్నారు. కాగా తాజాగా ఈ టాక్ షోకు స్టార్ హీరోలు ప్రభాస్, గోపిచంద్ గెస్ట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీళ్ల ఎపిసోడ్‌ను డిసెంబర్ 11న షూట్ చేయనున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌ను న్యూయర్ సందర్భంగా రిలీజ్ చేయాలని ఆహా సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రభాస్-గోపిచంద్ ఇద్దరు కలిసి ‘వర్షం’ సినిమాలో తొలిసారిగా నటించారు. అప్పటి నుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. గోపిచంద్ పలు ఇంటర్వూలలో కూడా ప్రభాస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇక వీరిద్ధరూ కలిసి మొదటి సారిగా ఒక టాక్ షోకు రానుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇక గోపిచంద్ కూడా తన ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుతుపుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

