Prabhas | మూడో సారి కూడా టాలీవుడ్ నెం.1 హీరోగా ప్రభాస్..!
Prabhas Ranked No.1 Place | 'బాహుబలి'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. అయితే ఈ రెండు చిత్రాల ఫలితాలు ప్రభాస్ క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఈయన నటించిన 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధంగా ఉంది.
Prabhas Ranked No.1 Place | ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. అయితే ఈ రెండు చిత్రాల ఫలితాలు ప్రభాస్ క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక ఇటీవలే విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులనులతో పాటు ప్రేక్షకులు, రాజకీయ నాయకులు టీజర్‌పై విమర్శలు కురిపించారు. అయితే నెగెటీవ్లోనూ ఈ చిత్రం పాజిటీవ్ రికార్డును సాధించింది. యూట్యూబ్‌లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ టీజర్‌గా నయా రికార్డును క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా మూడోసారి ఆర్మాక్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉంది.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Sep 2022) #OrmaxSIL pic.twitter.com/8UbxzMm8P0
— Ormax Media (@OrmaxMedia) October 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

