Prabhas | లుంగీ లుక్‌లో దర్శనమివ్వబోతున్న ప్రభాస్?
Raja Delux Movie | ప్రభాస్ ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో వైపు మారుతితో ఓ మిడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. రాజా డిలక్స్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చడి చప్పుడు లేకుండా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం స్పెషల్‌గా డేట్స్ ప్లాన్ చేసుకోకుండా వీలైనప్పుడల్లా షూటింగ్లో పాల్గొంటూ సినిమాను పూర్తి చేస్తున్నాడట.
Raja Delux Movie | ప్రభాస్ ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో వైపు మారుతితో ఓ మిడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. రాజా డిలక్స్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చడి చప్పుడు లేకుండా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం స్పెషల్‌గా డేట్స్ ప్లాన్ చేసుకోకుండా వీలైనప్పుడల్లా షూటింగ్లో పాల్గొంటూ సినిమాను పూర్తి చేస్తున్నాడట. ఇక ముందు నుంచి ఈ సినిమాపై ఎక్కడలేని వ్యతిరేకత వచ్చింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో.. వరుస ఫ్లాపుల్లో ఉన్న మారుతితో సినిమా చేస్తున్నాడని తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఊగిపోయారు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలని ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ కూడా చేశారు.
కానీ ప్రభాస్ అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడు. అయితే ఆ మధ్య ఈ సినిమా సెట్స్ నుండి లీకైన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. బియర్డ్ లుక్.. టీ షర్ట్ పైన చెక్స్ షర్ట్ వేసుకున్న ఫోటోతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కాస్త ట్రోలింగ్ కూడా తగ్గింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా బృందం ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డిజైన్ చేసే పనిలో పడ్డారట. కాగా ఫస్ట్‌లుక్ పోస్టర్లో ప్రభాస్ లుంగీలో మాస్ అవతారంలో కనిపించనున్నాడని సమాచారం.
ప్రభాస్ ఇమేజ్ను పక్కన పెట్టి సింపుల్‌గా, క్యాజువల్ లుక్‌లో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దింపనున్నారట. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతుందట. సంజయ్ దత్ ప్రభాస్‌కు తాతగా కనిపించున్నాడటని టాక్. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవికా మోహన్ నటించనుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోతున్న పీపులు మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

