మెగాస్టార్ 154వ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన పేరిట ఎన్నో రికార్డులని లిఖించుకున్న చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయిన చిరు.. ‘ఖైధీ నెంబర్.150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. చివరిగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా రూపొందిన ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు చిరు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా వలన వాయిదా పడ్డ ఈ చిత్రం మరి కొద్దిరోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం మలయాళంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమాని చిరు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆగస్టు 21 సాయంత్రం సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మరో వైపు చిరంజీవి .. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ని రేపు ఉదయం ఇవ్వనున్నారు.అయితే ఈ సినిమాకి భోలా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం అందుతుంది. దీనిపై రేపు ఉదయం పూర్తి క్లారిటీ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

