అఖండ రాజసం

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయిక. గురువారం బాలకృష్ణ జన్మదినం సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో రాజసంతో చిరునవ్వులు చిందిస్తూ ైస్టెలిష్‌గా బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే అన్ని హంగులుంటాయి. బాలకృష్ణ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉంటుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించి బ్యాలెన్స్ సన్నివేశాల్ని పూర్తిచేస్తాం. చిత్రీకరణ పూర్తయిన తర్వాత విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. జగపతిబాబు, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhanda
- Balaiah
- Boyapati srinu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

