Macherla Niyojakavargam | ‘మాచర్ల నియోజకవర్గం’ వీడియో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న నితిన్ హూక్ స్టెప్స్
Pori Superoo Video Song | యంగ్ హీరో నితిన్ గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో రెండు థియేటర్లో విడుదలవగా, ఒకటి నేరుగా ఓటీటీలో విడుదలైంది. అయితే ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా నితిన్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఈ యువ హీరో ఆశలన్ని ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి. ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, పాటలలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని ‘పోరి సూపరో’ అంటూ సాగే మాస్ బీట్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. నితిన్, కృతి శెట్టి సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మహతీ స్వర సాగర్ స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధురీ ఆలిపించారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘రారా రెడ్డి’, ‘అదిరిందే’ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు.కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

