800 The Movie | పాపులర్ నిర్మాత చేతికి 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్ రైట్స్..!
800 The Movie | 800 టైటిల్(800 Title)తో లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
800 The Movie | లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్ వస్తోన్న విషయం తెలిసిందే. 800 టైటిల్(800 Title)తో వస్తోన్న ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ (Madhurr Mittal) నటిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మురళీధరన్ లుక్కు ఏమాత్రం తీసిపోని విధంగా మెస్మరైజ్ చేస్తున్నాడు మధుర్ మిట్టల్. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తమిళంతోపాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రాన్నిమూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత, పాపులర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
ఈ బ్యానర్లో ఆదిత్య 369, నాని నటించిన జెంటిల్ మెన్, యశోదతోపాటు పలు సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. మహిమ నంబియార్ కీలక పాత్రలో నటించనుండగా.. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్ ఖాతాలో ఉంది. ఈ రికార్డు స్ఫూర్తితోనే సినిమాకు 800 టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
మురళీధరన్ పాత్రలో మొదట మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. అయితే ఎల్టీటీఈతో సివిల్ వార్ సమయంలో అప్పటి శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సకు ముత్తయ్య మురళీధరన్ మద్దతు పలికాడని తమిళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బయోపిక్ నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతికి మురళీధరన్ ఓ లేఖ కూడా రాశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు విజయ్ సేతుపతి.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

