GG Krishna Rao | కళాతపస్వి సినిమాలకు పనిచేసిన ఎడిటర్ కన్నుమూత
GG Krishna Rao | తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్, నిర్మాత జి.జి కృష్ణారావు (87) (GG Krishna Rao) కన్నుమూశారు. మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆ
GG Krishna Rao | తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్, నిర్మాత జి.జి కృష్ణారావు (87) (GG Krishna Rao) కన్నుమూశారు. మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
జీజీ కృష్ణారావు (GG Krishna Rao) పలు భాషల్లో సుమారు 200కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగులో కళాతపస్వి కె. విశ్వనాథ్ (K. Viswanath), దాసరి నారాయణరావు (Dasari Narayanarao), బాపు, జంధ్యాల వంటి లెజెండరీ డైరెక్టర్ల సినిమాలకు ఆయన సేవలందించారు.
కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శంకరాభరణం’ (sankarabharanam), ‘సాగర సంగమం’ (Sagara Sangamam), ‘స్వాతిముత్యం’, ‘శుభలేఖ’ వంటి సినిమాలతోపాటు శృతి లయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, స్వరాభిషేకం వంటి హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా సేవలందించారు.
1981లో కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సప్తపది’కి బెస్ట్ ఎడిటర్‌గా కృష్ణరావు నంది అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమా నుంచి ఎడిటర్ విభాగంలో నంది అవార్డు ఇవ్వడం మొదలు పెట్టారు. అనంతరం ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ చిత్రాలకు కృష్ణారావు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కళాతపస్వి కే విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కినవి కావడం విశేషం.
‘మిలన్’, ‘ఈశ్వర్’, ‘సుర్ సంగమ్’, ‘జ్వర్ భట’ 1973, ‘మస్తానా’ 1970 వంటి సూపర్ హిట్ హిందీ సినిమాలతో పాటు.. ‘ఎజుమలైయన్ మహిమై’ 1997, ‘సలంగై ఓలి’ 1983 వంటిది అనేక తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు.
గుడివాడ ఎ.ఎన్.ఆర్. కాలేజీలో ఎమ్మెసీ చేసిన జి.జి. కృష్ణారావు మొదట ఆర్మీలో చేరాలని భావించారు. అయితే అనుకోకుండా పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. 1961-62లో ఎడిటింగ్ కోర్సు చేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకులు, ఎడిటర్ ఆదుర్తి సుబ్బారావుగారి దృష్టిలో పడ్డారు. ఆలా చెన్నైలో అడుగు పెట్టిన కృష్ణారావు..‘పాడవోయి భారతీయుడా’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కూర్పరిగా చేశారు. కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

