కోల్‌కతా : అవుట్డోర్ షూటింగ్లో పాల్గొనడంతో వడదెబ్బకు గురైన ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బెంగాలీ సినీ, టీవీ పరిశ్రమలో పేరొందిన డొలన్ రాయ్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఓ సీరియల్ షూటింగ్ నిమిత్తం అవుట్డోర్ షూట్లో పాల్గొని గురువారం ఇంటికి తిరిగిరాగానే ఎండ వేడిమికి ఆమె వడదెబ్బకు గురయ్యారని నటి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 1990ల నుంచి డొలన్ రాయ్ సినీ, టీవీ పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. అప్నా ఘర్, సంఘట్, కకాబాబు, అలిక్ సుఖ్, ధిక్ జెనో లవ్ స్టోరీ, జీవన్ సాథి వంటి పలు సినిమాలు, సీరియల్స్‌లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.