కొత్తదనానికే ఆదరణ
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న సినిమా ‘పాప్ కార్న్'. ఈ చిత్రాన్ని ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు.
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న సినిమా ‘పాప్ కార్న్’. ఈ చిత్రాన్ని ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకుడు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. లిఫ్టులో పిక్చరైజ్ చేసిన పాట ఆకట్టుకుంది. హీరో సాయి రోనక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ సీరియల్ 128 దేశాల్లో అనువాదమైంది. ఆమె ఈ సినిమాతో నిర్మాతగా మారింది. కొత్త తరహా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. చిత్ర సమర్పకులు ఎంఎస్ చలపతి రాజు మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. పెద్దవాళ్లు సినిమా చూస్తూ తమ గతానికి వెళతారు. యువత సినిమాను ఆస్వాదిస్తారు’ అన్నారు. నాయిక అవికాగోర్ మాట్లాడుతూ…‘ఈ సినిమాలో నటించి, నిర్మించడం గర్వంగా ఉంది. కొత్త కాన్సెప్ట్ మూవీ. సాంకేతికంగా సవాలు లాంటి చిత్రమిది. మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

