బాయ్‌ఫ్రెండ్‌తో బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్

లాస్ ఏంజిల్స్ : పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్.. బాయ్‌ఫ్రెండ్ సామ్ అస్గరిని ఎంగేజ్మెంట్ చేసుకున్నది. సోషల్ మీడియా ద్వారా ఆ వేడుక జరిగింది. 39 ఏళ్ల బ్రిట్నీ తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను ఇన్స్టాగ్రామ్ వీడియోలో పోస్టు చేసింది. ఇది నేనే నమ్మలేకపోతున్నానని ఓ కామెంట్ పెట్టింది. ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో సామ్ కూడా ఉన్నాడు. ఆదివారం తమ ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఆ జంట ప్రకటించింది. ఈ ఇద్దరి మధ్య 2016లో తొలి పరిచయం జరిగింది. స్లంబర్ పార్టీ మ్యూజిక్ వీడియో సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వేలుకు రింగ్ తొడిగిన బ్రిట్నీ తన బాయ్‌ఫ్రెండ్‌ను కిస్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పెట్టారు. బ్రిట్నీ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్‌లు వచ్చేశాయి.
మాజీ భర్త కెవిన్ ఫీడర్లైన్తో బ్రిట్నీ విడిపోయింది. కెవిన్, బ్రిట్నీ జంటలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో చిన్ననాటి మిత్రుడు జేసన్ అలెగ్జాండర్నూ పెళ్లి చేసుకుంది బ్రిట్నీ. బేబీ వన్ మోర్ టైమ్ సాంగ్‌తో బ్రిట్నీ పాపులర్ అయ్యారు. అయితే గత 13 ఏళ్ల నుంచి బ్రిట్నీ తన తండ్రి సంరక్షణలో ఉంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

