Rangamarthanda Movie | ప్రమోషన్లలో నత్తనడక సాగిస్తున్న రంగమార్తాండ బృందం.. ఇలా అయితే కష్టమే బాసూ..!
Rangamarthanda Movie Promotions | ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్టయిన 'నట సామ్రాట్'కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కృష్నవంశీ ఆశలన్నీ రంగమార్తండ సినిమాపైనే ఉన్నాయి.
Rangamarthanda Movie Promotions | పద్దెనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘గులాబి’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణవంశీ. తొలిసినిమాకే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. విషయం ఉన్న దర్శకుడు అనే పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది నాగార్జునతో నిన్నే పెళ్లాడుతా తెరకెక్కించి సౌత్‌లో సెన్సేషన్ అయ్యాడు. రెండో సినిమాకే నేషనల్ అవార్డు అందుకుని హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత సింధూరం, అంత:పురం, మురారి, ఖడ్గం వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో టాలీవుడ్లో తిరుగులేని దర్శకుడిగా మారాడు. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో జోరు మీదున్న కృష్ణవంశీ ఆ తర్వాత కాస్త డల్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించే సరికి ఫామ్ కోల్పోయాడు.
నిజానికి గత పదేళ్లుగా కృష్ణవంశీకి హిట్టే లేదు. చివరగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా నక్షత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. దాంతో ఆరేళ్లు గ్యాప్ తీసుకొని రంగమర్తాండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్టయిన ‘నట సామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై కాస్త మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. ఈ సినిమాను మార్చి22న విడుదల చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అంటే మరో వారం రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.
కానీ, ఇప్పటివరకు ఈ సినిమాపై ఆశించిన బజ్ మాత్రం ఏర్పడలేదు. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమా వస్తుందంటే.. దగ్గరలో మరో సినిమా రిలీజయ్యేదే కాదు. అలాంటిది ఇప్పుడు సినిమా రిలీజవుతున్న విషయమే సగం జనాలకు తెలీదు. ఇప్పుడున్న సమయంలో ఎంత ప్రమోషన్లు చేస్తే సినిమా ప్రేక్షకుల్లోకి అంత వెళ్తుంది. కానీ రంగమార్తాండ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉంది. ఒకానోక సమయంలో అసలు ఈ సినిమా రిలీజవుతుందా అనే అనుమానం కూడా ప్రేక్షకుల్లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాను మైత్రీ సంస్థ డిస్ట్రబ్యూట్ చేస్తుంది. మైత్రీ అంటేనే ప్రమోషన్లలో కింగ్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది వారం రోజులు కూడా సమయంలేని రంగమార్తాండ విషయంలో మాత్రం ప్రమోషన్ల విషయంలో నత్త నడక సాగిస్తుంది. ప్రీమియర్లు వేస్తున్నా.. సినిమాకు కావాల్సిన బజ్ మాత్రం రావడం లేదు.
పైగా అదే రోజున విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడించింది. అంతేకాకుండా ఏకంగా తారక్ ఈసినిమా ఫంక్షన్‌కు రాబోతున్నాడు. దాంతో ఈ సినిమాపై మరింత బజ్ పెరిగే చాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో రంగమార్తాండ ప్రమోషన్లు జరపకపోవడం గమనార్హం. మరి ఈ వారం రోజుల్లో కావాల్సినంత బజ్ తీసుకొస్తారో లేదో చూడాలి.
ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం …#Rangamarthanda on March 22nd…@PRAKASHRAAJ @MERAMYAKRISHNAN #BRAHMANANDAM @ilaiyaraaja @RajaShyamalaEnt @MythriOfficial @kalipumadhu5 @venky8883 @SillyMonksMusic #RangamarthandaOnMarch22 pic.twitter.com/e0Aypuay6T
— Krishna Vamsi (@director_kv) March 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

