Rangabali Movie | రంగబలి.. రంగుపడింది.. నాగశౌర్యకు ఈ సారి కూడా పెద్ద దెబ్బే..
Naga Shaurya | ఛలో తర్వాత ఆ రేంజ్ హిట్టు కోసం ఐదేళ్లుగా పరితపిస్తున్నాడు నాగశౌర్య. కొత్త జానర్లలో సినిమాలు ట్రై చేస్తున్న నాగశౌర్యకు అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు ఛలో తర్వాత ఏకంగా ఎనిమిది ఫ్లాపులు.
Naga Shaurya | ఛలో తర్వాత ఆ రేంజ్ హిట్టు కోసం ఐదేళ్లుగా పరితపిస్తున్నాడు నాగశౌర్య. కొత్త జానర్లలో సినిమాలు ట్రై చేస్తున్న నాగశౌర్యకు అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు ఛలో తర్వాత ఏకంగా ఎనిమిది ఫ్లాపులు. మధ్యలో స్వయంగా కథ రాసుకుని తీసిన అశ్వథామ పర్వాలేదనిపించినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక ఛలో తర్వాత ఆ రేంజ్లో టీజర్, ట్రైలర్లతో మెప్పించిన సినిమా అంటే అది రంగబలి సినిమానే. ముందు నుంచి ఈ సినిమాపై జానాల్లో మంచి ఆసక్తి నెలకొంది. పైగా ప్రమోషన్లు గట్రా బాగానే ప్లాన్ చేయడంతో జానాల్లో బాగానే రిజిస్టర్ అయింది.
సినిమా మీదున్న నమ్మకంతో ముందు రోజు నుంచే ఈ సినిమాకు ప్రీమియర్లు వేశారు. పైగా నాగశౌర్య సైతం ఈ సినిమా హిట్టు, సూపర్ హిట్టు కాదు ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా నిర్మాతకు కూడా ఈ సినిమా బోలెడు లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పాడు. కాగా తీరా ప్రీమియర్ షో చూశాక ఆడియెన్స్ రెస్పాన్స్ నెగెటీవ్‌గా వచ్చింది. తొలిభాగం కామెడీతో గట్టెక్కిన.. మలిభాగం మాత్రం బోర్ కొట్టిచ్చిందని రివ్యూలు ఇచ్చేశారు. దాంతో ఈ సినిమా కలెక్షన్లకు పెద్ద దెబ్బ పడింది. తొలిరోజు కోటి రూపాయల రేంజ్లో కూడా కలెక్షన్లు రాలేదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
రంగబలికి ఈ వీకెండ్ చాలా కీలకం కానుంది. శని ఆదివారాలు వీలైనంత రాబట్టుకుంటే బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌కు దగ్గరవుతారు. కానీ తొలిరోజు కలెక్షన్లే ఫుల్ డిసప్పాయింట్ చేశాయి. ఈ లెక్కన రంగబలి సినిమా గట్టెక్కాలంటే గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది. పైగా వచ్చేవారం బేబి, మాహవీరుడు, నాయుకుడు వంటి సినిమాలు పోటీకి రాబోతున్నాయి. ఈలోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. లేదంటే నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్లే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

