Poonam Pandey | పూనమ్ పాండేకు కేన్సర్ కాదు.. ఆ వ్యాధి ఉందట !
Poonam Pandey | పూనమ్ పాండే పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటుంది. గత మూడునాలుగు రోజులుగా నటి పూనమ్ పాండే వార్తల్లో నిలుస్తూ వస్తున్నది.
Poonam Pandey | పూనమ్ పాండే పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటుంది. గత మూడునాలుగు రోజులుగా నటి పూనమ్ పాండే వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. సోషల్ మీడియాలో గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు నటి మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్ పోస్టు పెట్టారు. మరుసటి రోజు తాను బ్రతికే ఉన్నానంటూ వీడియోను రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను చనిపోయానంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశానని పేర్కొంది. అయితే, పూనమ్ పాండే ‘పబ్లిసిటీ స్టంట్’పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవగాహన కల్పించేందుకు చనిపోయారంటూ ఫేక్ వార్తలను ప్రచారం చేయడాన్ని ‘ఆరోగ్యకరమైన మార్గం’గా పరిగణించలేమని పలువురు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌పై కేంద్రమంత్రి కీలక ప్రకటన చేయడం గమనార్హం. గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో వచ్చే ప్రధాన క్యాన్సర్లలో ఒకటి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు ఈ క్యాన్సర్ కారణమవుతుంది.
పూనమ్ పాండేకు ఇదేం కొత్త కాదు..
అయితే, పూనమ్ పాండే హెడ్‌లైన్స్‌లో నిలిచేందుకు ఇలాంటి పద్ధతులను అవలంభించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో 2011 ప్రపంచకప్ సమయంలో పూనమ్ పాండే వార్తల్లో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఫైనల్లో భారత జట్టు గెలిస్తే తాను బట్టలు విప్పేసి తిరుగుతానంటూ వార్తలకెక్కింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో నటిపై నెటిజన్లు మండిపడ్డారు. అయితే, ఈ పరిస్థితిపై జాతీయ మీడియాతో డాక్టర్ సత్యకాంత్ త్రివేది మాట్లాడుతూ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు పలువురు అనేక పద్ధతులను అవలంభిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ ప్రెజెంట్ చేస్తూ ఎక్కువ మంది ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. పూనమ్ పాండే మాత్రం చావు లాంటి సెన్సిటివ్ టాపిక్‌ను ఎంచుకుతుందన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించే ఈ విధానాన్ని మనస్తత్వశాస్త్రంలో హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారని తెలిపారు.
హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే..?
హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్ (HPD) అనేది మానసిక ఆరోగ్య రుగ్మత. అలాంటి వారిలో భావోద్వేగ అస్థిరత, సెల్ఫ్ ఇమేజ్ గురించి ఆందోళన, అత్యధిక కోరికలు కలిగి ఉంటాయరన్నారు. పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారని.. తమ ప్రవర్తన, ఆలోచన విధానం సమస్యాత్మకంగా ఉండవచ్చని గుర్తించరు. హెచ్పీడీ సమస్య అరుదైన రుగ్మతలలో ఒకటి. దాదాపు ఒకశాతం మందికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్ ముఖ్య లక్షణం దృష్టిని ఆకర్షించడం. అలా చేయకపోతే వారు నిరాశకు లోనవుతారు. తరచుగా మితిమీరిన నాటకీయత, అతిగా ఉద్వేగభరితంగా వ్యవహరిస్తారు.
దృష్టిని ఆకర్షించేందుకే..
ఆకర్షణీయంగా కనిపించేందుకు, ప్రజలు దృష్టిని ఆకర్షించడానికి వింత దుస్తులను ధరించడం.. మేకప్ ధరించడం చేస్తుంటారని నిపుణులు పేర్కొన్నారు. కొందరిలో హెచ్పీడీ జన్యుపరంగా కూడా ఉంటుందని డాక్టర్ సత్యకాంత్ పేర్కొన్నారు. బాల్యంలో గాయాలపాలైన, నిర్లక్ష్యానికి గురైన వ్యక్తుల్లోనే హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి వ్యక్తులను తప్పనిసరిగా మానసిక వైద్యులకు చూపించాలని, చికిత్స ద్వారా సమస్యలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

