Poojahegde | అనతికాలంలోనే స్టార్ హీరోలందరితో నటిస్తూ మోస్డ్ వాంటెడ్ హీరోయిన్గా మారింది పూజా హెగ్డే. సౌత్ నుండి నార్త్ వరకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లలో హీరోయిన్ గా నటిస్తూ వరుస హిట్లతో దూసుకుపొతుంది. ఇక తాజాగా ఈ అమ్మడుకి బిగ్ బీ పక్కన నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశం వెండితెరపై కాదు..ప్రముఖ శీతలపానీయాల కంపెనీ మాజా రూపొందించే ప్రకటనలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది. అయితే తాజాగా మాజా బ్రాండ్ నిర్వహిస్తున్న దిల్ దార్ బన్ దే ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ…తన అభిమాన నటుడైన అమితాబ్‌బచ్చన్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని..ఆయనతో కలిసి యాడ్‌లో పనిచేయడం కూడా గొప్ప అవకాశమేనని వెల్లడించింది.
మాజా రూపొందించే ఈ యాడ్ ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాజిత్ సర్కార్ దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం పూజా చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఈమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా థలపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఇక బీస్ట్ చిత్రాన్ని ఎప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహలు చేస్తుందట.