విజయ్ దేవరకొండ జోడీగా..
అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే..మంగళూరు సోయగం పూజాహెగ్డేనే అంటున్నారు తెలుగు సినీ జనాలు. పట్టిందల్లా బంగారం అన్న చందంగా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా పలు భారీ చిత్రాల్లో నాయికగా ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది
అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే..మంగళూరు సోయగం పూజాహెగ్డేనే అంటున్నారు తెలుగు సినీ జనాలు. పట్టిందల్లా బంగారం అన్న చందంగా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా పలు భారీ చిత్రాల్లో నాయికగా ఈ అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా ఈ పొడుగుకాళ్ల వయ్యారి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జనగణ మన’ పేరుతో దేశభక్తి ప్రధాన చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఖరారు చేసినట్లు తెలిసింది. కథ నచ్చడంతో పాటు పాన్ ఇండియా సినిమా కావడంతో పూజాహెగ్డే వెంటనే అంగీకారం తెలిపిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఆమెకిది తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో పూజాహెగ్డే నాయికగా ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 27న విడుదలకాబోతున్న ‘ఎఫ్-3’ చిత్రంలో ఈ భామ ఐటెంసాంగ్‌లో నర్తించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

