Pooja Hegde | బంపరాఫర్ కొట్టేసిన మంగళూరు సోయగం
మంగళూరు సోయగం పూజా హెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందడంతో రేసులో పూర్తిగా వెనకబడిపోయింది.
Pooja Hegde | మంగళూరు సోయగం పూజా హెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందడంతో రేసులో పూర్తిగా వెనకబడిపోయింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసిందీ భామ. ఆమె కోరుకున్నట్లుగానే తమిళంలో సూర్య సరసన నటించే బంపరాఫర్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం సూర్య పీరియాడిక్ చిత్రం ‘కంగువ’లో నటిస్తున్నారు.
ఇది పూర్తయిన వెంటనే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నారు. సూర్య నటించబోతున్న 44వ చిత్రమిది. ఈ నెలలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఖరారు చేశారు. ‘బీస్ట్’ తర్వాత పూజాహెగ్డే తమిళంలో మరే చిత్రంలో నటించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రం తప్పకుండా పూజాహెగ్డే కెరీర్‌కు బ్రేక్‌నిస్తుందని, ఆమె తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

