Ponniyin Selvan | చూపుతిప్పుకోనివ్వని ‘‘పొన్నియిన్ సెల్వన్’’ టీజర్
ఒక పక్క ఒళ్లు గగుర్పొడియే యుద్ధ సన్నివేశాలు.. మరోపక్క ఆమెను మర్చిపోలేకపోతున్నాననే ఆవేదన.. అందమైన సినిమాటోగ్రఫీ.. వీటికితోడు మెస్మరైజ్ చేసే మణిరత్నం డైరెక్షన్.. అందుకే ‘‘పొన్నియిన్ సెల్వన్’’ టీజర్ చూసిన అభిమానుల చూపు తిప్పుకోలేకపోతున్నారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరో చియాన్ విక్రమ్ అస్వస్థతతో ఆస్పత్రి పాలవడంతో టీజర్ లాంచ్ చేస్తారా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టిన చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. వివిధ భాషల్లో అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు, మోహన్ లాల్, సూర్య, రక్షిత్ శెట్టి వంటి సూపర్ స్టార్లు డిజిటల్‌గా దీన్ని విడుదల చేశారు.
10వ శతాబ్దంలో చోళ రాజుల మధ్య పవర్ స్ట్రగుల్‌ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమిళ రైటర్ కల్కి రచించిన ప్రఖ్యాత నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణిరత్నం ప్యాషన్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

