PS-2 | ప్రమోషన్లలో స్పీడ్ పెంచిన పొన్నియన్ సెల్వన్-2 టీమ్
Ponniyin selvan-2 Movie | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Ponniyin selvan-2 Movie | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చింది. అయితే మిగితా భాషల్లో మాత్రం బోటా బోటీ మార్కులతోనే సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్‌పై కోలీవుడ్‌లో యమ క్రేజ్ ఉంది. ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే బుకింగ్స్ ఓపెనవగా.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా జరుపుతున్నారు. విక్రమ్, కార్తి, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ఇలా సినిమాలోని ప్రధాన తారాగణం ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై తమిళంలో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులోనూ మరో రెండు, మూడు రోజుల్లో ప్రమోషన్లు జరుపనున్నట్లు తెలుస్తుంది. అయితే తెలుగులో ఈ సినిమాపై అంతగా బజ్ లేదు. తొలిపార్టు కూడా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. తెలుగులో ప్రీ రిలీజ్లు గట్రా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తే కాస్తో కూస్తో బజ్ ఏర్పడే చాన్స్ ఉంది.
హిస్టారికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

