PS-2 Movie | రెండొందల కోట్ల క్లబ్లో పొన్నియన్ సెల్వన్-2.. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతున్న విజువల్ వండర్
PS-2 Movie enters 200 crore club | పొన్నియన్ సెల్వన్ పార్ట్-1కు కాస్త నెగెటీవ్ రివ్యూలు వచ్చినా.. సెకండ్ పార్ట్‌కు మాత్రం పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. పైగా పోటీగా విడుదలైన ఏజెంట్ తుస్సు మనడంతో సినీ ప్రేక్షకులకు ఈ సినిమానే ఆప్షన్ అయిపోయింది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది.
PS-2 Movie enters 200 crore club | ఎప్పుడెప్పుడా అని తమిళ తంబీలు ఎంతగానో ఎదురు చూసిన పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 గత శుక్రవారం రిలీజైంది. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువే హైప్ క్రియేట్ అయింది. ఇక రిలీజ్ తర్వాత కూడా పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది. తొలి రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మొదటి పార్టు రేంజ్లో కాకపోయినా.. తొలిరోజు బాగానే నెట్టుకొచ్చింది. సినిమా టాక్ బాగుండటంతో రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి విజయ ఢంకా మోగించింది.
కాగా తెలుగులో తొలిపార్టు నిరాశపరచగా.. రెండో భాగం మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. పైగా పోటీగా విడుదలైన ఏజెంట్ తుస్సు మనడంతో సినీ ప్రేక్షకులకు ఈ సినిమానే ఆప్షన్ అయిపోయింది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఇక తాజాగా ఈ సినిమా రెండొందల కోట్ల క్లబ్లో అడుగుప్టెంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఘనత సాధించి తమిళ నాట రికార్డులు నెలకొల్పుతుంది. ఇదే జోరు కొనసాగితే వారం తిరిగే లోపే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. వీక్ డేస్‌లోనూ బుకింగ్స్ భారీ రేంజ్‌లోనే జరుగుతున్నాయట.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారగణం ఈ సినిమలో నటించారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

