Ponniyin Selvan | భారీ ధరకు ‘పొన్నియిన్ సెల్వన్-1’ ఆడియో హక్కులు
Ponniyin Selvan Audio Rights | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. టీజర్‌తోనే మణిరత్నం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.
ప్రముఖ మ్యూజిక్ సంస్థ ‘టిప్స్’ ‘పొన్నియిన్ సెల్వన్’ ఆడియో హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.25 కోట్లకు అన్ని భాషల ఆడియో రైట్స్‌ను ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇంత భారీ మొత్తంలో ఆడియో హక్కులు అమ్ముడయ్యాయంటే విశేషం అనే చెప్పాలి. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

