PS-2 | పొన్నియన్ సెల్వన్-2 సరికొత్త స్ట్రాటజీ.. తొలి దక్షిణాది సినిమాగా అరుదైన ఘనత
PS-2 Movie | ఇప్పటివరకు 2డీ, 3డీలలో దక్షిణాది సినిమాలు చూసిన మనకు 'పొన్నియన్ సెల్వన్ -2' బృందం తొలిసారి 4డీఎక్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను పరిచయం చేయబోతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమా 2డీ, 3డీలతో పాటు 4డీఎక్స్లోనూ రిలీజ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
PS-2 Movie | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చింది. అయితే మిగితా భాషల్లో మాత్రం బోటా బోటీ మార్కులతోనే సరిపెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్‌పై కోలీవుడ్‌లో యమ క్రేజ్ ఉంది. బుకింగ్స్ ఓపెనవడమే లేటు.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ముస్తాబవుతుంది.
ఇప్పటివరకు 2డీ, 3డీలలో దక్షిణాది సినిమాలు చూసిన మనకు ‘పొన్నియన్ సెల్వన్ -2’ బృందం తొలిసారి 4డీఎక్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను పరిచయం చేయబోతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమా 2డీ, 3డీలతో పాటు 4డీఎక్స్లోనూ రిలీజ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు మాత్రమే 4డీఎక్స్‌లో రిలీజయ్యేవి. ఇక ఇప్పుడు తొలిసారి ఒక దక్షిణాది సినిమా 4డీఎక్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటివరకైతే కోలీవుడ్‌లో తెలియదు కానీ.. ఇక్కడైతే ఎలాంటి బజ్ లేదు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. మరీ రిలీజ్ టైమ్ వరకు మేకర్స్ ఏదైనా గ్రాండ్‌గా ప్లాన్ చేసే సినిమాపై హైప్ తీసుకొస్తారా? లేదా? అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

