లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కాంపౌండ్ నుంచి వస్తున్న భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్. రెండు పార్టులుగా రాబోతుండగా ఇప్పటికే విడుదలైన పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు.. నిర్మాతలకు కాసులు కురిపించింది. ఇపుడు సిల్వర్ స్క్రీన్‌పై ఈ సినిమా చూడని వారి కోసం గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పొన్నియన్ సెల్వన్ -1 ఇక డైరెక్టుగా అందరి ఇళ్లల్లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
పొన్నియన్ సెల్వన్ -1 వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. జనవరి 8న సాయంత్రం 6:30 గంటలకు సన్ నెట్వర్క్ ఛానల్లో ప్రీమియర్ కానుందని తెలియజేస్తూ.. సన్ టీవీ ప్రోమో లాంఛ్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ భారీ మల్టీస్టారర్‌లో విక్రమ్, నాజర్, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, కార్తీ, జయం రవి, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష కీలక పాత్రలు పోషించారు.
కాగా రీసెంట్గా పొన్నియన్ సెల్వన్ -2 (Ponniyin Selvan-2) అప్డేట్ కూడా అందించి మూవీ లవర్స్ ను ఖుషీ చేశాడు మణిరత్నం. ఫస్ట్ పార్టును తెరకెక్కించిన మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సీక్వెల్ పార్టును కూడా తెరకెక్కిస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్ -2 ప్రపంచవ్యాప్తంగా 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనున్నట్టు ప్రకటించింది.
వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ప్రోమో..
போர்க்களத்தை பார்க்கத் தயாரா?
வரும் ஞாயிறு மாலை 6.30 மணிக்கு பிரம்மாண்டமான வரலாற்று திரைப்படம் "பொன்னியின் செல்வன் "#WorldTelevisionPremiere#SunTV #PonniyinSelvan #PonniyinSelvanOnSunTV #Vikram #ARRahman #JayamRavi #Karthi #AishwaryaRai #Trisha #ManiRatnam pic.twitter.com/CzGfrh4mhu
— Sun TV (@SunTV) January 1, 2023