Ponniyin Selvan-1 | మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం.. తొలి భాగం పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ మూవీ ప్రస్తుతం అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది. చూడాలనుకునేవారు రూ.199 పెట్టి ఈ సినిమాను చూడొచ్చు. అయితే, నవంబర్ 4 నుంచి ప్రైమ్ సబ్స్క్రైబర్లు అందరూ ఈ సినిమాను చూడొచ్చని ఓటీటీ ప్లాట్‌ఫామ్ పేర్కొంది.
పొన్నియన్ సెల్వన్-1లో విక్రమ్, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, పార్థీబన్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, జయరామ్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమ్ ఈ చిత్రంలో చోళ చక్రవర్తి ఆదిత్య కరికాలన్ పాత్రలో కనిపించారు.