Jabardasth Comedian | జబర్దస్త్ నటుడు నవసందీప్ అరెస్ట్
Jabardasth Comedian | యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జబర్దస్త్ ఫేమ్ నటుడు నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Jabardasth Comedian | వెంగళరావునగర్, ఆగస్టు 24 : యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జబర్దస్త్ ఫేమ్ నటుడు నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. జబర్దస్త్ నటుడు నవసందీప్ 2018లో ఓ యువతి (28)ని వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో కబుర్లు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు.
షేక్‌పేటలోని అల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్లో నాలుగేళ్లుగా ఉంటున్నది. ఈ క్రమంలో సందీప్ ఆ యువతిని పెండ్లి పేరుతో నమ్మించి కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెండ్లి విషయం ప్రస్తావించడంతో నిరాకరించాడు. తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోల్కొండ పోలీసులు.. ఆ కేసును మధురానగర్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన మధురానగర్ పోలీసులు నిందితుడు నవసందీప్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

