Pisachi-2 Teaser | అత్యంత భయానికంగా ‘పిశాచి-2’ టీజర్.. ఆకట్టుకుంటున్న ఆండ్రీయా నటన
Pisachi-2 Teaser | విభిన్న కథలను తెరకెక్కించడంలో తమిళ డైరెక్టర్ మిష్కిన్ ముందు వరుసలో ఉంటాడు. ‘పిశాచి’, ‘డిటెక్టీవ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పిశాచి-2’. 2004లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘పిశాచి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండేళ్ళ క్రితమే మిష్కిన్ అనౌన్స్ చేశాడు. కరోనా కారణంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆండ్రీయా దెయ్యంలాగా పరిచయమవుతూ టీజర్ ప్రారంభమైంది. 1 నిమిషం 8 సెకన్ల నిడివి గల ఈ టీజర్ అత్యంత భయానికంగా ఉంది. కార్తీక్ రాజా నేపథ్యం సంగీతం ఒకవైపు థ్రిల్ ఫీల్‌ను కలుగజేస్తూనే మరోవైపు భయానికి గురిచేస్తుంది. శివ శాంతకుమార్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. రాక్‌ఫోర్ట్ ఎంటర్టైనమెంట్ పతాకంపై టి. మురుగనాంతన్ నిర్మిస్తున్నాడు. ఆండ్రీయా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, పూర్ణ, కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

