కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!

ఎన్నో కుటుంబాల్లో కరోనా తీరని విషాదం నింపుతుంది. చూస్తుండగానే తమ వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ దొరక్క కొందరు.. సరైన చికిత్స దొరక్క మరికొందరు.. వెంటిలేటర్ లేక ఇంకొందరు.. ఇలా మనకు కావాల్సిన వాళ్లే కళ్ల ముందు చనిపోతుంటే మౌనంగా రోదించడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ హీరోయిన్ సోదరుడు వెంటిలేటర్ దొరక్క చనిపోయాడు. అదే విషయాన్ని చాలా బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ హీరోయిన్. ఆమె ఎవరో కాదు.. రంగం సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న పియా బాజ్పెయీ. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాల్లోనూ నటించింది ఈమె. పియా సోదరుడు కొన్ని రోజుల కింద కరోనా బారిన పడ్డాడు.
ఆయన పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన సోదరుడికి అర్జెంట్ గా వెంటిలేటర్ సాయం కావాలని.. బెడ్ దొరకడం లేదని.. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఈమె వేడుకుంది. కానీ ఏం చేస్తాం.. అది కుదర్లేదు. ఉదయం 6.24 నిమిషాలకు సీరియస్ అని ట్వీట్ చేసిన ఈమె.. రెండు గంటల తర్వాత 8.40 నిమిషాలకు తన సోదరుడు చనిపోయాడంటూ ట్వీట్ చేసింది. అంతా చూస్తుండగానే కళ్ల ముందే అన్న ప్రాణాలు పోయాయని కన్నీరు పెట్టుకుంది పియా. సోదరుడి మరణం తట్టుకోలేపోతున్నానంటూ ఎమోషనల్ అయిపోయింది.
బాలీవుడ్లో చాలా మంది ఇలా తమకు కావాల్సిన వాళ్లను పోగొట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ సైతం కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆప్తులను కోల్పోయానని.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ట్వీట్ చేసారు. ఇప్పుడు పియా బాజ్పెయీ విషయంలోనూ ఇదే జరిగింది. రంగంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలో నటించింది. మరో రెండు మూడు సినిమాలు కూడా చేసిన తర్వాత సరైన గుర్తింపు రాకపోవడంతో హిందీలో వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Brother
- carona
- pia bajpiee
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

