Peddi | ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్‌పై కొత్త ట్విస్ట్.. జూలై 2న రావడం లేదా?
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్లలో మంచి స్పందన దక్కించుకున్న ‘పెద్ది’ని ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు సాన ఎమోషనల్ టేకింగ్‌ను మరోసారి ఆస్వాదించాలని అభిమానులు భావిస్తున్నారు.
‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమా జూలై 2, 2026 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదల కావడంతో నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డిజిటల్ విడుదలను మరో రెండు వారాలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 16, 2026న ‘పెద్ది’ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే జూలై 2 లేదా జూలై 16 విడుదల తేదీలపై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ గానీ, చిత్ర నిర్మాణ సంస్థ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న తేదీలు కేవలం ప్రచారం మాత్రమే. ఓటీటీ విడుదలపై స్పష్టత రావాలంటే మేకర్స్ లేదా స్ట్రీమింగ్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ సినిమా హిందీ వెర్షన్ జూలై 30న ప్రత్యేకంగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై కూడా అధికారిక ధృవీకరణ లేదు. ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

