Peddi Movie | ‘పెద్ది’ ఐటెం సాంగ్ వెనుక 50 రోజుల కష్టం ఉంది : అనంత శ్రీరామ్!
Peddi Movie Anant Sriram | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కలయికలో రాబోతున్న 'పెద్ది' చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
Peddi Movie Anant Sriram | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కలయికలో రాబోతున్న ‘పెద్ది’ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఈ సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల్లల్లల్లో’ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘చీర.. చొక్కా.. చిక్కెడిపోవాలంటూ..’ సాగే ఈ మాస్ లిరిక్స్ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తాజాగా మీడియాతో పంచుకున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తాను ఇప్పటివరకు సుమారు 30 పాటలు రాశానని, అయితే ఈ ఐటెం సాంగ్ కోసం చేసిన ప్రయోగం పూర్తిగా భిన్నమైనదని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా వచ్చే ఐటెం సాంగ్స్ తరహాలో కాకుండా, రెహమాన్ అద్భుతమైన కొత్త బాణీని అందించారని, ఆ ట్యూన్ వినడానికే తమకు ఐదు రోజులు పట్టిందని గుర్తుచేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే శైలిలో సాగే ఈ వినూత్నమైన పాటను పూర్తి చేయడానికి తనకు ఏకంగా 50 రోజుల సమయం పట్టిందని అనంత శ్రీరామ్ వివరించారు.
ఇదే సినిమాలో ఇప్పటికే ఆకట్టుకున్న ‘రైరా రారా’ పాట గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చిన ప్రశంసను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ పాట విన్న వెంటనే చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేసి, తన జీవిత తత్వాన్ని, ఆలోచనలను ఇప్పటి కాలానికి తగ్గట్టుగా అద్భుతంగా ఆవిష్కరించావంటూ కొనియాడారని, అది తన కెరీర్లోనే మర్చిపోలేని గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ స్పెషల్ ఐటెం సాంగ్‌ను మే 23న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇందుకోసం భోపాల్‌లో ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ వేడుకలో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ స్వయంగా లైవ్ కాన్సర్ట్ నిర్వహించి, వేదికపైనే ఈ పాటను ప్రదర్శించనుండడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

