PeddhaKapu-1 Movie | పెదకాపు ట్రైలర్ వచ్చేస్తుంది.. శ్రీకాంత్ అడ్డాల అలాంటి వివాదాస్పద సబ్జెక్ట్‌ను టచ్ చేస్తున్నాడా?
భగవంతుడే లోకమంతా నిండి ఉన్నప్పుడు, భగవంతుడే అంతా తానై ఉన్నప్పుడు.. ఇక ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? పాపం ఏంటి? పుణ్యం ఏంటి?.
PeddhaKapu-1 Movie | సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్ అడ్డాల నారప్పతో మాస్ సినిమాలు డీల్ చేయడంలో కూడా దిట్ట అని నిరూపించుకున్నాడు. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. ఒరిజినల్ సోల్ మిస్సవ్వకుండా శ్రీకాంత్ తన టేకింగ్‌తో కథను నడిపిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రముఖ నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డిని హీరోగా పెట్టి పెద కాపు అనే ఓ అవుట్ అండ్ అవుట్ రా, రస్టిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ నుంచి మొన్న రిలీజైన గ్లింప్స్ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఓ సామాన్యుడు సంతకం అంటూ మేకర్స్ సినిమాను ప్రమోట్ చేస్తూ జనాల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.
పెదకాపు సినిమాను ఈ మంథ్ ఎండింగ్ 28న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రమోషన్ల వేటను కొనసాగిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా తొలుత ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లు శ్రీకాంత్ అడ్డాల ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తూ ప్రకటించాడు. భగవంతుడే లోకమంతా నిండి ఉన్నప్పుడు, భగవంతుడే అంతా తానై ఉన్నప్పుడు.. ఇక ధర్మం ఏంటి? అధర్మం ఏంటి? పాపం ఏంటి? పుణ్యం ఏంటి?. మరి మనిషి అనుభవం మాట, సామాన్యుడికి తగిలే దెబ్బల మాట సంగతేంటి?. సామాన్యుడిగా మనిషి ఎప్పుడు దు:ఖం నుండి సుఖంలోకి చీకటి నుండి వెలుగులోకి రావాలనే అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి.. తన దారిన తాను పోయేవాడికి, ఆ దారే మూసేసి తొక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదంటూ ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
చూస్తుంటే ఇదేదో కులాల ఆదిపత్యాలు, రాజకీయాలు, వర్గ పోరాటాల చుట్టూ ఈ కథ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇంత వివాదాస్పద సబ్జెక్ట్‌ను టచ్ చేస్తున్నాడంటే శ్రీకాంత్ అడ్డాల సాహసానికి మెచ్చుకోవాల్సిందే. గతంలోనూ ముకుందా సినిమాలో ఇలా రాజకీయ నేపథ్య కథను ఎంచుకున్నా.. దానిని చాలా సున్నితంగా, విమర్శలకు తావివ్వకుండా తెరకెక్కించాడు. కానీ పెదకాపు మాత్రం అలా అనిపించడం లేదు. టైటిల్, గ్లింప్స్‌ల నుంచి విమర్శలకు దారి ఇచ్చేలా కనిపిస్తున్నాయి. చూడాలి మరి శ్రీకాంత్ అడ్డాల ఎంత రస్టిక్‌గా సినిమాను చూపించాడో.
Every voice raised becomes a common man’s signature ✍️✊🏻#PeddhaKapu1 Theatrical Trailer Out On Sept 11th! 💥@ViratKarrna @officialpragati @SrikanthAddala_ @MickeyJMeyer @Editormarthand @NaiduChota @anusuyakhasba @mravinderreddyy @dwarakacreation #PeddhaKapu1OnSep29th 🔥 pic.twitter.com/wUBhjvBxtr
— BA Raju’s Team (@baraju_SuperHit) September 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

