ఆ వార్తలన్నీ అబద్ధం!

తెలుగు బిగ్‌బాస్ ఐదవ సీజన్లో తాను పాల్గొనబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘నేను బిగ్‌బాస్ 5వ సీజన్లో భాగం కావడం లేదు. ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అనవసరమైన పుకార్లను సృష్టించి నన్ను వివాదాల్లోకి లాగొద్దు’ అంటూ పాయల్‌రాజ్‌పుత్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. తెలుగు ‘బిగ్‌బాస్-5’ సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్స్ ఎంపికకు కసరత్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ తారల పేర్లు తెరపైకొస్తున్నాయి. గత బిగ్‌బాస్ సీజన్లో పాయల్‌రాజ్‌పుత్ ఓ ప్రత్యేక గీతంలో అలరించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తాజా సీజన్లో పాల్గొనబోతున్నదని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటన్నింటికి తన ట్వీట్ ద్వారా సమాధానమిచ్చింది పాయల్‌రాజ్‌పుత్. తెలుగులో ‘ఆర్.ఎక్స్.100’ చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ఈ సుందరి తొలి సినిమాతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత సీత, వెంకీమామ, డిస్కోరాజా వంటి సినిమాల్లో సత్తా చాటింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigboss
- payal rajput
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

