పంజాబీ సినిమాలలో నటించిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆర్ఎక్స్ 100 పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో కార్తికేయతో ఆమె చేసిన రొమాన్స్ ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో పాయల్‌కి ఆఫర్స్ బాగానే వచ్చాయి. కాని ఆ సినిమా తర్వాత మళ్లీ అలాంటి హిట్ పాయల్ ఖాతాలో చేరలేదు.
డిస్కోరాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై పాయల్ రాజ్ పుత్ బాగానే హోప్స్ పెట్టుకుని ఉంది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్న పాయల్.. సక్సెస్ రేట్ కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో పాయల్ తాజాగా ఎల్లో జంప్ సూట్ ధరించి ఎద అందాలను ఆవిష్కరిస్తూ బోల్డ్ లుక్ లో మత్తెక్కించింది. అయితే ఈ వీడియోలో అమ్మడి అందాలు శృతిమించి కనిపించాయి. దీంతో వెంటనే వీడియోని డిలీట్ చేసిది. కాని అప్పటికే మనోళ్లు డౌన్ లౌడ్ చేసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ చీరలో మెరిసినా, మోడరన్ డ్రెస్సుల్లో కనిపించినా కుర్రాళ్లకు గిలిగింతలు తప్పవు. తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాయల్ ప్రస్తుతం యాంజెల్, కిరాతక, హెడ్ బుష్ అనే చిత్రాల్లో నటిస్తోంది.