కాంతారా చాప్టర్ 1లో ఛాన్సివ్వరూ.. ప్లీజ్
అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదని పెద్దల నానుడి. అందాల భామ పాయల్ రాజ్‌పుత్‌కి ఈ విషయం బాగా తెలుసు. అందుకే అడిగి మరీ అవకాశాలు దక్కించుకుంటున్నది.
అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదని పెద్దల నానుడి. అందాల భామ పాయల్ రాజ్‌పుత్‌కి ఈ విషయం బాగా తెలుసు. అందుకే అడిగి మరీ అవకాశాలు దక్కించుకుంటున్నది. ‘మంగళవారం’ సినిమా అవకాశాన్ని కూడా ఇలాగే అడిగే దక్కించుకుంది. ఈ సారి ఈ అమ్మడు కుంభస్థలానికే గురిపెట్టింది. దేశవ్యాప్త సంచలనం ‘కాంతారా’కు ప్రీక్వెల్‌గా ఆ చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు అయిన రిషబ్ శెట్టి ‘కాంతారా: చాప్టర్ 1’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఈ సినిమాపై మామూలుగానే అంచనాలు ఓ స్థాయిలో ఉంటే, ఈ ఫస్ట్‌లుక్‌తో అవి ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకోసం ఆడిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ‘కాంతారా చాప్టర్ 1’లో తనకు అవకాశం ఇవ్వమని హీరో రిషబ్శెట్టికీ, చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్కీ ట్వీట్స్ చేసింది పాయల్ రాజ్‌పుత్.
‘కాస్త సమయం వెచ్చించి నా ‘మంగళవారం’ సినిమా చూడండి. అందులో నా నటన మీకు నచ్చితే అవకాశం ఇవ్వండి. ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా నేను రెడీ. ఏం చేయాలో దయచేసి చెప్పండి.’ అంటూ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది పాయల్. ఈ పోస్ట్‌ని పలువురు నెటిజన్స్ రీట్వీట్ చేస్తూ ‘ఆమెను తీసుకోండి. ‘మంగళవారం’లో చాలాబాగా చేసింది. అందులోని శైలు పాత్ర ఆమె మాత్రమే చేయగలదు. ఆమె ట్వీట్‌కు దయచేసి స్పందించండి’ అంటూ రిషబ్శెట్టికీ, హోంబాలే ఫిల్మ్స్కూ నెటిజన్స్ ట్యాగ్ చేశారు. మరి పాయల్ ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

