వకీల్ సాబ్ ట్రైలర్ రివ్యూ.. పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

ఒకటి రెండు కాదు.. మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లి ఇకపై సినిమాలు చేయనని ప్రకటించినప్పుడు వాళ్ల గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని వరుస సినిమాలు చేస్తున్నాడు పవన్. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
సాధారణంగానే పవన్ సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా.. దాంతో అవి రెండింతలు అయిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత పవన్ అభిమానులు ఎవరూ భూమి మీద లేరు. అంతా గాల్లో తేలిపోతున్నారు. ఇది కదా ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తాము కోరుకున్నది అంటూ ఊగిపోతున్నారు.
వకీల్ సాబ్ ట్రైలర్..
దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్ కట్ చేసినట్లు అర్థమైపోతుంది. టీజర్ లోనే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చూపించిన వేణు.. ఇప్పుడు ట్రైలర్ లో డోస్ మరింత పెంచాడు. అభిమానులు పవన్ సినిమా నుంచి ఏం కోరుకొంటారో అవన్నీ బేరీజు వేసుకొని మరి ట్రైలర్ లో చూపించాడు. ఒకవైపు యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తూనే.. మరోవైపు సినిమాలో కథ ఎక్కడ పక్కదారి పట్టకుండా ట్రైలర్ కట్ చేసిన విధానం అదరహో అనిపిస్తుంది.
ఇది చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరగడం కాదు పరిగెడుతున్నాయి. ఏప్రిల్ 9కి కేవలం మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. దిల్ రాజు, బోని కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

