Pawan Kalyna | విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం
Pawan Kalyna | స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన చిరంజీవికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగానే తన అన్నయ్యకి ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
Pawan Kalyna | స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన చిరంజీవికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగానే తన అన్నయ్యకి ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం అని అన్నారు పవన్.
చిరంజీవి జీవితం వెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన ‘విశ్వంభరుడుస..! పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న విశ్వంభర చిత్ర టీజర్ నిన్న సాయంత్రం విడుదలైంది. ఇది ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. ఇక ఈ రోజు ఉదయం చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ రానుంది. సాయంత్రం బాబీ- చిరంజీవి కాంబోకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇలా చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చే ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

