Tholi Prema Movie | మళ్లీ థియేటర్లలోకి టైమ్ లెస్ క్లాసిక్ తొలిప్రేమ.. రిలీజ్ ఎప్పుడంటే?
Tholi Prema Movie Re-Release | టాలీవుడ్లో ఎన్ని ప్రేమకథలు వచ్చినా తొలిప్రేమ మేనియాను ఏది మ్యాచ్ చేయలేకపోయింది. ఇప్పటికీ ఆల్‌టైమ్ క్లాసికల్ హిట్‌గా తొలిప్రేమ సినిమానే చెప్పకుంటుంటారు. పాతికేళ్ల కిందట ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు.
Tholi Prema Movie Re-Release | టాలీవుడ్ ప్రేమకథల్లో టైమ్ లెస్ క్లాసిక్‌గా చెప్పుకునే సినిమా ‘తొలిప్రేమ’. పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అప్పటికే మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లో మంచి ఫామ్‌లో ఉన్న పవన్‌కు ఈ సినిమా తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. పేరుకు ప్రేమకథే అయినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మాస్ నంబర్స్ క్రియేట్ చేసింది. ఏ కరుణాకరన్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోని వారుండరు. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, పవన్-కీర్తికు మధ్య వచ్చే సీన్స్, ప్రేక్షకులను ఎమోషనల్ చేసిన క్లైమాక్స్, విజిల్స్ వేయించిన పాటలు, సిస్టర్ సెంటిమెంట్ ఇలా సినిమాలో ప్రతీది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అప్పట్లోనే ఈ సినిమా తొమ్మిది కోట్ల షేర్‌ను సాధించి అల్‌టైమ్ రికార్డు సృష్టిచింది. కాగా ఈ సినిమా వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా మరోసారి ప్రేక్షకులకు ఈ ఆల్‌టైమ్ క్లాసిక్‌ను చేసేందుకు మేకర్స్ రీ-రిలీజ్‌ను సిద్ధం చేస్తున్నారు. జూన్ 30న ఈ సినిమా 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ కానుంది. కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేషనల్ అవార్డును గెలుచుకుంది. కాగా ఈ సినిమా ముందుగా అక్కినేని సుమంత్ దగ్గరకు వెళ్లిందట. అయితే పలు కారణాల వల్ల సుమంత్ ఈ కథను వద్దనుకున్నాడని సమాచారం. దాంతో కరుణాకరన్ పవన్‌కు ఈ కథ వినిపించాడట. పవన్‌కు కథ నచ్చడంతో ఒక్క సిట్టింగ్‌లోనే ఓకే అయిపోయిందట. ఈ సినిమాతో కరుణాకరన్ పేరు కూడా టాలీవుడ్లో మార్మోగిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

