‘ఓజీ’గా గత ఏడాది పవన్‌కల్యాణ్ చేసిన హంగామా అంతాఇంతా కాదు. ముంబై గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌కల్యాణ్‌ని దర్శకుడు సుజీత్ చూపించిన తీరు అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది. ఈ సినిమా ైక్లెమాక్స్లోనే సీక్వెల్‌కు హింట్ కూడా ఇవ్వడంతో ‘ఓజీ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. నానితో ‘బ్లడీ రోమియో’ చేశాక, పవన్ ‘ఓజీ 2’ పనులు మొదలుపెట్టాలని సుజీత్ ముందు భావించారు. అయితే.. నాని ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంకా పూర్తి కాకపోవడం, అనుకున్న సమయానికి నాని డేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల ‘బ్లడీ రోమియో’ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది.
అందుకే.. సుజీత్ ‘ఓజీ 2’పై ఫోకస్ పెట్టినట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నదట. ‘ఓజీ 2’ను మొదటి భాగానికి సీక్వెల్‌గా కాకుండా, ఓ కొత్త కథను డిజైన్ చేస్తున్నారట సుజీత్. పవన్ రోల్ కూడా లోకల్ డాన్ స్థాయి నుంచి గ్లోబల్ గ్యాంగ్‌స్టర్ రేంజ్‌కి ఎలివేట్ చేసే ఆలోచనలో సుజీత్ ఉన్నారని వినికిడి. అయితే.. స్క్రిప్ట్ సిద్ధమైనా షూటింగ్‌కి వెళ్లడం పెద్ద ప్రాసెస్. అందునా పవన్‌కల్యాణ్‌తో షూటింగ్ అంటే చిన్న విషయం కాదు. ఈ లోపు నాని కూడా రెడీ అనొచ్చు. ‘బ్లడీ రోమియో’ మొదలు కావచ్చు. లేదా ముందే ‘ఓజీ 2’ సెట్స్‌కి వెళ్లొచ్చు. ఏదైనా జరగొచ్చు.