‘పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో విజువల్ ఫీస్ట్‌లా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఓ బందిపోటు వీరోచితగాథగా అలరిస్తుంది. భారతీయ సినిమాలో ఇప్పటివరకు రానటువంట కథ ఇది’ అన్నారు క్రిష్. ఆయన దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.
ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. నేడు పవన్‌కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్వాగతిస్తుంది సమరపథం..దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అనే క్యాప్షన్స్తో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘నేడు పవర్‌గ్లాన్స్ పేరుతో ఓ వీడియో విడుదల చేయబోతున్నాం. ఇప్పటికే సినిమా యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నాం’ అని చెప్పారు.