Varasudu Movie | వారసుడు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో?
తమిళ హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. 'తుపాకీ' సినిమా నుండి 'బీస్ట్' వరకు ప్రతీ సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడేకంగా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థతో చేతులు కలిపి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Varasudu Movie Pre-Release event | తమిళ హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘తుపాకీ’ సినిమా నుండి ‘బీస్ట్’ వరకు ప్రతీ సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడేకంగా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థతో చేతులు కలిపి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం వారసుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రోమోలు, టీజర్లు రిలీజ్ చేయకుండానే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రెండు చోట్ల ఘనంగా జరపాలని చిత్రబృందం ప్లాప్ చేస్తుందట. ఈ క్రమంలో తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు గెస్ట్‌గా పిలవనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. పవన్ గెస్ట్‌గా వస్తే వారసుడు సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికాకంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ద్విభాషా సినిమాగా రూపోందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించాడు. విజయ్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన రంజితమే, ది దళపతి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

