They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత ఓజీ టీం షూటింగ్ మూడ్‌లోకి వచ్చేసింది.. బ్యాక్ టు ఓజీ.. అంటూ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఇన్ స్టాగ్రామ్‌లో అందమైన లొకేషన్లో క్రేన్ ఉన్న స్టిల్‌ను షేర్ చేశాడు. ఓజీ షూటింగ్ షురూ అయిందని తెలిసిందే. డైరెక్టర్ సుజిత్, పవన్ కల్యాణ్ టీం ఫైరింగ్ మూడ్‌లో ఉంది.
షూట్ లొకేషన్లో సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, సుజిత్, మ్యూజిక్ ఎస్ థమన్ వర్కింగ్ మూడ్‌లో ఉన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానును కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తాజా స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఓజీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఖచ్చితంగా షాట్ పడుతుంది. మా నుండి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ వస్తుంది. సుజీత్ అగ్గి రాజేస్తే.. రవి కె చంద్రన్ ఎలివేషన్ మెయిన్ హైలెట్‌గా ఉండబోతుందని చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు.
The Boys are all in! 🔥🔥#Sujeeth @MusicThaman @dop007#OG #TheyCallHimOG pic.twitter.com/x10Wx8xobz
— DVV Entertainment (@DVVMovies) October 17, 2024
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్