Pawan Kalyan | రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan | ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం’ అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రో’. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నేను నా జీవితాన్ని చాలా సింపుల్‌గా వుండాలనుకున్నాను.
Pawan Kalyan | ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం’ అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రో’. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నేను నా జీవితాన్ని చాలా సింపుల్‌గా వుండాలనుకున్నాను. ఒక నటుడు అవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా చేసేటప్పుడు అందులో సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి విషయం వుంటే బాగుంటుంది అనుకుంటాను.
ఇది చాలా సంపూర్ణమైన సినిమా. ఇది అందర్ని అలరిస్తుందని భావిస్తున్నాను. సినిమా అంటే నాకు ఇష్టం, సమాజం అంటే బాధ్యత . జూనియర్ ఎన్టీఆర్‌లా, రామ్‌చరణ్‌లా నేను గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు, ప్రభాస్, రానాలా సంవత్సరాలు కష్టపడి సినిమా చేయలేకపోవచ్చు. అయినా నాకు సినిమా అంటే ప్రేమ.ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందినది కాదు. మా కుటుంబానికి కూడా చెందినది కాదు. ఇది అందరిదీ. ఈ కోట్లాది మందిలో ఎవరైనా సరే బలంగా అనుకుంటే ఇక్కడ రాణించగలరు.నాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదు. అప్పుడు మా వదిన మార్గనిర్ధేశం చేశారు. మా వదిన వల్లే ఈ రోజు ఇలా మీ ముందుకు నటుడిగా వచ్చాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

