పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తునారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ ైస్టెలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ను థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే చిత్ర బృందం థాయ్‌లాండ్‌కు వెళ్లిందని, అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇదిలావుండగా సెప్టెంబర్ 2న పవన్‌కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.