Ajay Arasada | పవన్ కళ్యాణ్‌తో అరగంట ముచ్చట.. కాఫీ కప్పు స్పీకర్‌పై ఆయన జోక్స్: సంగీత దర్శకుడు అజయ్ అరసాడ
Pawan Kalyan | టాలీవుడ్లో వైవిధ్యమైన సంగీతంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తాజాగా మీడియా ముఖంగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Pawan Kalyan | టాలీవుడ్లో వైవిధ్యమైన సంగీతంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తాజాగా మీడియా ముఖంగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి వరుస ప్రాజెక్ట్‌లతో శ్రోతలను అలరిస్తున్న ఆయన, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అనుభవాలను, పవన్ కళ్యాణ్‌తో జరిగిన ప్రత్యేక సమావేశం తాలూకు జ్ఞాపకాలను ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారు.
వైజాగ్ నేపథ్యం నుంచి వచ్చిన తన రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉన్నాయని తెలిపిన అజయ్, టీసీఎస్‌లో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పని చేసినట్లు వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని, తన తల్లి మరియు భార్య అందించిన అండదండల వల్లే తాను ఈ రంగంలో నిలదొక్కుకోగలిగానని చెప్పారు. వైజాగ్‌లో తనకు మంచి స్నేహితుడైన శ్రీ చరణ్ ద్వారా ‘గూఢచారి’ సినిమాకు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసే అవకాశం దక్కిందని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్న చిత్రాలకు పనిచేయడం వల్ల తనకు పేమెంట్స్ పరంగా ఎక్కడా ఇబ్బంది రాలేదని, అన్ని జానర్ల కథలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని అజయ్ స్పష్టం చేశారు. కెరీర్ ఆరంభంలో తన పాటల కోసం సింగర్లను ఎంపిక చేసుకునే విషయంలో ఎదురైన ఇబ్బందులను, నేడు అదే నిర్మాతలు తన నిర్ణయాన్ని ఎలా అభినందిస్తున్నారో ఆయన వివరించారు.
ఓటీటీ మరియు థియేట్రికల్ ప్రాజెక్ట్‌ల మధ్య ఉండే వ్యత్యాసం గురించి మాట్లాడుతూ.. థియేటర్ సౌండింగ్ కోసం తాము కష్టపడి ఇచ్చే మ్యూజిక్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చేసరికి దాని ప్రభావం కొంత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మ్యూజిక్ ప్రభావం గురించి స్పందిస్తూ, టెక్నాలజీని ఎంత వాడినా మానవ స్పర్శతో కూడిన సంగీతాన్ని ఏఐ భర్తీ చేయలేదని, నిర్మాతలు నేరుగా ఏఐ ట్రాక్స్ పంపి అలా కావాలని కోరితే ఎలాగంటూ ఆయన చమత్కరించారు. ఇక తన జీవితంలో మరువలేని క్షణాల గురించి చెబుతూ, జనసేన పార్టీ కార్యక్రమాలకు తాను అందించిన మ్యూజిక్ స్కోర్‌ను చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తనను పిలిపించి మాట్లాడడం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని తెలిపారు. కేవలం ఐదు నిమిషాలు మాట్లాడి వద్దామనుకుని వెళ్లిన తనకు, పవన్ కళ్యాణ్‌తో ఏకంగా అరగంట పాటు చర్చించే అవకాశం దక్కిందని, భవిష్యత్తులో పొలిటికల్‌గా లేదా ‘పీకే క్రియేటివ్స్’ బ్యానర్లో కలిసి పనిచేద్దామని ఆయన భరోసా ఇచ్చినట్లు అజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో భాగంగా తన దగ్గర ఉన్న కాఫీ మగ్ షేప్‌లో ఉండే బోస్ స్పీకర్‌ను పవన్ కళ్యాణ్ చూసి, “కాఫీ పట్టుకొచ్చావా?” అంటూ సరదాగా జోక్ చేయడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించిందని ఆయన నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఇక కొందరు కొత్త దర్శకులు పాటల సందర్భాన్ని, కాన్సెప్ట్‌ను సరిగ్గా వివరించలేకపోతున్నారని, మ్యూజిక్ డైరెక్టర్‌కు లేదా లిరిసిస్ట్‌కు భావన అర్థమైతేనే అద్భుతమైన ట్యూన్స్ వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాజెక్ట్‌లలో క్రెడిట్స్ విషయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో పెద్ద కమర్షియల్ సినిమాలకు కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించగలననే పూర్తి ఆత్మవిశ్వాసం తనకు ఈ పదేళ్ల ప్రయాణంలో ఏర్పడిందని అజయ్ అరసాడ ముగించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

