పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ ‘ఇటీవల పవన్‌కల్యాణ్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఆయన అభిమానుల్లో సినిమాపై ఉత్సుకతను పెంచింది. షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అయాంకబోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్.